![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -25 లో.....భూషణ్ తన ఫ్రెండ్ ని రమ్మని తన కార్ లో వెళ్ళిపోతాడు. మంచిపని చేసాడు లేదంటే మహా గురించి తప్పుగా మాట్లాడతాడా అని ఆదితో ప్రతాప్ అంటాడు. అతనికి ఇంకా మహాని పెళ్లి చేసుకోవాలని ఉందని ఆది అంటాడు. మరొకవైపు మహాని చక్రి తీసుకొని వెళ్తుంటే ఒక దగ్గర కార్ ఆగుతుంది.
చక్రి కార్ దిగబోతుంటే ఇక్కడ ఎందుకు అపావు. నాకు భయంగా ఉంది. కావాలనే అపావు కదా అని మహా అంటుంది. లేదండి ఇంజన్ హీట్ అయిందని చక్రి చెప్తాడు. చక్రి బయట వైపు వెళ్లి మహాని తీసుకొని వెళ్తాడు. మహాకి భయం వేసి ఒక పెద్ద రాయి పట్టుకుంటుంది. చక్రి తన కోసం చలిమంట పెడతాడు. దాంతో అతన్ని తప్పుగా అర్ధం చేసుకున్నానని మహా రాయి పక్కకి విసిరేస్తుంది. అ తర్వాత తనకి ఆకలిగా ఉందని మొక్కజొన్న కాల్చి ఇస్తాడు చక్రి. మహాకి నిద్ర వచ్చి తన భుజాలపై తల వాలుస్తుంది మహా. దాంతో చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని పక్కన పడుకోపెట్టి దుప్పటి కప్పి తనని రాత్రంతా అలా చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం మహా నిద్రలేచి కార్ దగ్గరికి వెళ్తుంది. ఆతర్వాత చక్రి, మహాని తీసుకొని సిటీకి బయల్దేరతాడు.
అప్పుడే భూషణ్ వాళ్ళ కార్ చక్రి కార్ కి ఎదురుగా వచ్చి ఆగుతుంది. భూషణ్ కార్ దిగి.. మహా నా కార్ ఎక్కు అని తనపై కోప్పడుతాడు. నేను ఎక్కను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోకుంటే మీ కార్ అద్దాలు పగులగొడతానని మహా అనగానే భూషణ్ వాళ్ళ ఫ్రెండ్ భయపడి భూషణ్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. ఇక చక్రి, మహా ఇద్దరు వెళ్తున్న కార్ ని భూషణ్, తన ఫ్రెండ్ తో కలిసి ఫాలో చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |